Monday, 12 December 2011

Adiganani Anukovaddu Lyrics - Balaraju Katha Old Telugu Movie Song Lyrics

చిత్రం : బాలరాజుకధ
గానం : ఘంటసాల, సుశీల
రచన : కొసరాజు
సంగీతం : కె.వి.మహదేవన్


అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం


ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతుఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకుని మొక్కుతుఉంటారెందుకు
అది వీధిలోన పడి ఉన్నందుకు .. అది వీధిలోన పడి ఉన్నందుకు
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ …

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం


మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
లోకులు చూచి తరించుటకు … లోకులు చూచి తరించుటకు
పలుగాకుల బొజ్జల పెంచుటకు… పలుగాకుల బొజ్జల పెంచుటకు


మహమ్మదీయులు పిలిచే దేవుడు
క్రైస్తవులంతా కొలిచే దేవుడు
ఏడుకొండల వేంకటేశ్వరుడు గోవిందా .. గోవిందా
శ్రీశైలంలో మల్లికార్జునుడు
వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా
శ్రీశైలంలో మల్లికార్జునుడు
వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా
సర్వవ్యాపి నారాయణుడు ….
సర్వవ్యాపి నారాయణుడు ఎక్కడ జూచిన ఉంటాడు
ఆ స్వామి కొరకె నే శోధిస్తున్నా .. తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా
ఆఁ అట్టా రండి దారికి …
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
మీరొక్క దెబ్బతో తేల్చారు ..
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
మీరొక్క దెబ్బతో తేల్చారు
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు
ఏ రాతికి మొక్కను వచ్చారు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. What is the answer to the MOST importatnt Question:
    ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు
    ఏ రాతికి మొక్కను వచ్చారు

    ReplyDelete