Wednesday, 21 December 2011

Sivaranjani Navaragini Lyrics - Thoorpu Padamara Songs Lyrics in Telugu

శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృత వాహిని

రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
స్వర సుర ఝారి తరంగానివీ
స్వర సుర ఝారి తరంగానివీ
సరస హృదయ వీణ వాహినీ

శివరంజని నవరాగిణి

ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధు కలశం...

శివరంజని నవరాగిణి
జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి
వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి
రాశికృత నవరసమయ జీవన రాగాచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా

రావే..... రావే నా శివరంజని... మనోరంజని
రంజని నా రంజని

నీవే నీవే నాలో పలికే నాదానివీ
నీవే నాదానివీ
నా దానివి నీవే నాదానివీ

Visit my YouTube channel at Vineela YouTube Channel  

9 comments:

  1. అక్షరాలు కాదు తేనె తుంపరలు
    పదాలు కాదు చెరుకు ముక్కలు
    పాట కాదు శృంగార రస ఊట

    ReplyDelete
  2. అక్షరాలు కాదు తేనె తుంపరలు
    పదాలు కాదు చెరుకు ముక్కలు
    పాట కాదు శృంగార రస ఊట

    ReplyDelete
  3. This song and abhinava taaravo are both mesmerizing songs listen to them both

    ReplyDelete