చిత్రం : ఉయ్యాల జంపాల
రచన : ఆరుద్ర
సంగీతం :పెండ్యాల
గానం : ఘంటసాల,సుశీల
కొండగాలి తిరిగిందీ గుండె ఊసులాడింది
గోదవరి వరదలాగ కోరిక చెలరేగింది || కొండ ||
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది
పట్టరాని లేత వలపు పరవసించి పాడింది || కొండ ||
మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది
నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది || కొండ ||
Lovely song! Thanks for sharing.
ReplyDeleteAdbhutam adbhutam adbhutam lyrics
ReplyDeleteLife was given to the amazing lyrics and music by the Legend of all male singers in Indian Music in Telugu and sweetest voice of telugu film industry.
ReplyDeleteSo beautiful lyrics and song set to Malaya maarutham raagam very aptly. Thanks
ReplyDeleteఈ పాట ముగింపు అద్భుతం.. చక్కని సాహిత్యానికి శ్రుతి కలిపిన గొంతు న్యాయం చేసింది...
ReplyDeleteచాలా గొప్ప పాట సెలయేటి పై తేలుతున్నట్లుంది చక్కగా సాగింది. పాడడం వారిరువురు కే సాధ్యం
ReplyDelete