Thursday, 31 May 2018

Raanani Raalenani Song Lyrics from Aatma Gowravam

చిత్రం : ఆత్మ గౌరవం (1965)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన : ఆరుద్ర
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు

రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు

చరణం 1:
కొంటె చూపు చూడకు గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు
కొంటె చూపు చూడకు గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు
వేషమైనా మోసమైనా అంతా నీ కోసం

ఊహూ...అలాగా...

రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు

చరణం 2:
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది...పాపం
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది

గుండె మీద వాలి చూడు గోడు వింటావు
ష్...అబ్బబ్బబ్బా...

రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు

చరణం 3:
దోర వయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో
దోర వయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో

కరుణ చూపి కరుగకున్న టాటా... చీరియో
టాటా... చీరియో

రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు

1 comment: