Wednesday 6 June 2018

Okate Hrudayam Kosamu Song Lyrics - Chaduvukunna Ammayilu

చిత్రం : చదువుకున్న అమ్మాయిలు
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:
గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .

ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ

చరణం 1:
ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా.. ఆ . . .

ఆ . . ఓ . .
జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ
ఆ . . .

చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
ఓ . . .

చరణం 2:
రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము
ఆ . . .
ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ

Neeko Thodu Kaavali - Chaduvukunna Ammayilu Lyrics

చిత్రం : చదువుకున్న అమ్మాయిలు
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి,
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి

చరణం 1:
నవనాగరీక జీవితాన తేలుదాం,
నైటుక్లబ్బులందు నాట్యమాడి
సోలుదాం
హో హో హొ హో
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి,
నేను అంతకన్న అప్టుడేటు బేబిని
వగలాడి నీకు తాళి బరువు ఎందుకు,
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైనజవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

చరణం 2:
నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను,
ఏదో హారుమణి వాయిస్తూ పాడుకుంటాను

దనిస నిదనిప మగదిస దిగమప

నేను చదువులేనిదాననని అలుసు నీకేల,
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల
నీతో వియ్యం దినదినగండం,
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని

ఓ తల్లి దయచేయి కోటిదండాలు

చరణం 3:
సిరులూ నగలూ మాకు లేవోయి,
తళుకూ బెళుకుల మోజు లేదోయి
హహహా...
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు
ధనరాశి కన్న నీ గుణమే మిన్న,
నీలో సంస్కారకాంతులున్నాయి
నీకో బ్రూటు దొరికిందీ
మెడలో జోలె కడుతుందీ
ఈమె కాలి గోటి ధూళి పాటి చేయరు
ఓ త్వరగా దయచేస్తె కోటి దండాలు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ,
హాయ్ నిన్నే నాదాన్ని చేసుకుంటాను

Evandoy Nidura levandoy - Chaduvukunna Ammayilu Songs Lyrics

చిత్రం : చదువుకున్న అమ్మాయిలు 
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
గానం :  ఆశాలత కులకర్ణి

పల్లవి:
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఎందుకు కలలో కలవరింత
ఎవరిని తలచి పలవరింత
ఎదుటకురాగా ఏల ఈ మగత
ఏమండోయ్.. నిదుర లేవండోయ్

చరణం 1:
ప్రేయసి నిద్దుర లేపుట..మోము చూపుట
పెళ్ళికి తదుపరి ముచ్చట..
ముందు జరుగుట.. చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం ఇంక చాలండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం 2:
యువతులు దగ్గర చేరినచో యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ నటన మానండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం 3:
నేనే వలచి రానిచో చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు ఇంక క్లోజండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్

Aadavalla Kopam Lo Song Lyrics - Chaduvukunna Ammayilu

చిత్రం : చదువుకున్న అమ్మాయిలు
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత : దాశరథి 
గానం : ఘంటసాల, సుశీల 

పల్లవి: 
ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనే అంతులేని అర్ధమున్నది.. అర్ధమున్నదీ
మొదటి రోజు కోపం అదో రకం శాపం
పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు పొత్తు కుదరదు

చరణం 1:
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం
పడుచువానీ .. ఒహో...
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం

వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు
ఆ తేనె కోరి చెంత చేర చెడామడా కుట్టు

చరణం 2: 
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు

వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం
వెంటపడిన వీపు విమానం

చరణం 3: 
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది
చిలిపికన్నె.. ఉహూ...
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది

ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి ఆ
మరపు రాని మధురమైన ప్రైజు దొరుకునోయి

Vinipinchani Ragale - Chaduvukunna Ammaylu Songs Lyrics

చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం:  సుశీల


పల్లవి:
ఓ...ఓ...ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...

చరణం 1:
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు

వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...

చరణం 2:
వలపే వసంతముల పులకించి పూచినది
వలపే వసంతముల పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు

వినిపించని రాగాలే కనిపించని అందాలే...

చరణం 3:
వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే

Maradu Maradu Lyrics - Aathma Bandhuvu Songs Lyrics

చిత్రం : ఆత్మ బంధువు
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : కొసరాజు
గానం :  సుశీల, జమునా రాణి 

పల్లవి :
మారదు మారదు మనుషుల తత్వం మారదు
మారదు మారదు మనుషుల తత్వం మారదు

మాటలతోటి మారిందనుకుని... మాటలతోటి మారిందనుకుని
ఎవ్వరు భ్రమపడకూడదు... మ్మ్....  మ్మ్
మారదు మారదు మనుషుల తత్వం మారదు

చరణం 1 : 
సూర్య చంద్రులూ మారలేదులే
చుక్కలు మొలవకా మానలేదులే
సూర్య చంద్రులూ మారలేదులే
చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం
మారటమంటే సుళువు కాదులే
మారటమంటే సుళువు కాదులే
మారదు మారదు మనుషుల తత్వం మారదు

చరణం 2 : 
పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు
దగ్గర బంధువులంటారు
పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు
దగ్గర బంధువులంటారు

పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు
చెవులకు చేటలు కడతారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు
చెవులకు చేటలు కడతారు

మారదు మారదు మనుషుల తత్వం మారదు

చరణం 3 :
కాసుపడనిదే తాళి కట్టరు
పెళ్ళిపీటపై వారు కాలుపెట్టరు
కాసుపడనిదే తాళి కట్టరు
పెళ్ళిపీటపై వారు కాలుపెట్టరు

కట్నములేనిదే ఘనతే లేదనీ
కట్నములేనిదే ఘనతే లేదనీ
చదువుకున్నవారే కలలుకందురూ
చదువుకున్నవారే కలలుకందురూ

మారదు మారదు మనుషుల తత్వం మారదు

చరణం 4 :
ఆకలికన్నం పెట్టేవాడే... ఏ... ఏ... ఏ..
ఆపదలో కాపాడేవాడే..ఏ... ఏ... ఏ..
ఆకలికన్నం పెట్టేవాడే..ఆపదలో కాపాడేవాడే
బంధువూ అతడే... బంధువూ...  ఆత్మబంధువూ
ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ 

మారదు మారదు మనుషుల తత్వం మారదు
మనుషుల తత్వం మారదు

Chaduvu Rani Vadavani Lyrics - Aatma Bandhuvu

చిత్రం  : ఆత్మ బంధువు (1962)
సంగీతం :  కె.వి. మహదేవన్
రచన  :  సినారె
గానం :  సుశీల

పల్లవి:
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు

చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం 1:
ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
ఏ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను

చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం 2:
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు
కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు

చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు