Showing posts with label Daagudu Moothalu. Show all posts

Monday, 12 December 2011

Adagaka ichina Manase Muddu - Old Telugu Songs Lyrics

అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

నడకలలో నాట్యం చేసే నడుము జూస్తే పిడికెడు ముద్దు

పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చకచకలాడే పిరుదులు దాటే జడను జూస్తే చలాకి ముద్దు

కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను జూస్తే ఏదో ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను జూస్తే ఏదో ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు
పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ఊహుహు.హూహు

చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ముద్దుకు ముద్దు