Showing posts with label Chinni Krishnudu. Show all posts
Showing posts with label Chinni Krishnudu. Show all posts

Wednesday, 15 September 2021

Jeevitham Saptasagara Geetham Lyrics - Chinni Krishnudu

జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం

సాగనీ పయనం

కల ఇల కౌగిలించే చోట .. కల ఇల కౌగిలించే చోట


జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం

సాగనీ పయనం

కల ఇల కౌగిలించే చోట .. కల ఇల కౌగిలించే చోట


ఏది భువనం ఏది గగనం తారా తోరణం

ఈ చికాగొ సీరిస్ టవరే  స్వర్గ సోపాణము

ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో


ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము..


హే... బ్రహ్మ మానస గీతం మనిషి గీసిన చిత్రం

చేతనాత్మక శిల్పం

మతి కృతి పల్లవించె చోట .. మతి కృతి పల్లవించె చోట


జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం

సాగనీ పయనం

కల ఇల కౌగిలించే చోట.. కల ఇల కౌగిలించే చోట


ఆ లిబర్టి శిల్ప శిలలలొ స్వేచ్చా జ్యోతులు

ఐక్య రాజ్య సమితిలొన కలిసే జాతులు

ఆకశాన సాగిపోయే అంతరిక్షాలు

ఈ మయామి బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము

హే.. సృష్టి కే ఇది అందం.. దృష్టి కందని దృశ్యం

కవులు రాయని కావ్యం

కృషి ఖుషి సంగమించే చోట

కృషి ఖుషి సంగమించే చోట


జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం

సాగనీ పయనం

కల ఇల కౌగిలించే చోట .. కల ఇల కౌగిలించే చోట