Tuesday 28 September 2021

Aa Kanulalo Song Lyrics - Aalaapana

చిత్రం: ఆలాపన (Aalaapana) 
సంగీతం: ఇళయరాజా (Illayaraja)
రచయిత: వేటూరి (Veturi )
గానం: బాలు, జానకి (S.P. Balasubramanyam, S. Janaki)

ఆ కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
ఆ కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై 

నిదురించు వేళ ..దసనిస దసనిస దనిదనిమ 
హృదయాంచలాన..ఆ..ఆ..ఆ..ఆ 

అలగా పొంగెను నీ భంగిమ..దదసనిస... 
అది రూపొందిన స్వర మధురిమ 
ఆ రాచ నడక రాయంచ కెరుక 
ఆ రాచ నడక రాయంచ కెరుక 
ప్రతి అడుగూ శృతిమయమై 
కణకణమున రసధునులను మీటిన 

ఆ... కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
ఆ కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై 

మగసా.. ఆ.. సనిదమగ మగసా.. ఆ..
గసనిదమ దనిసా.. ఆ.. మదని.. ఆ.. 
సానిదనిసగ మాగసగమగ 
నిదసనిదమగ గమపసగమగని

నీ రాకతోనే ఆ..ఆ..ఆ..ఆ ఈ లోయ లోనే ...
దసనిస దసనిస దనిదనిమ 
అణువులు మెరిసెను మణి రాసులై 
మబ్బులు తేలెను పలు వన్నెలై 
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని 
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని 
ఆకృతులై సంగతులై 
అణువణువున పులకలు ఒలికించిన 

ఆ... కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
ఆ... కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై...

Wednesday 22 September 2021

Na Jeevana Sandhya Samayamlo - Amara Deepam Song Lyrics

చిత్రం :  అమర దీపం (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల   

ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ... 

నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే  అపురూపమై అమరదీపమై వెలిగింది
నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది
ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ... 

శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది
గరిస..  సదపమ గమద మదని
దనిరిని గరిగరిసా సదసదపా మపగా

కళకే కళగా విరిసి.. నా కల నిజమై పండింది
శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది
కళకే కళగా విరిసి నా కల నిజమై పండింది
ఆరు ఋతువుల ఆమని కోయిల మనసే ఎగసి పాడింది
నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది 

పొద్దుపొడుపులో అరుణిమలే చెలి దిద్దు తిలకమై చివురించే
ఇంద్రధనుస్సులో రిమరిమలే చెలి పైట జిలుగులే సవరించే
ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన...
ఆఆఆ..ఆఆ.... ఆఆఆఅ.... ఆ.... ఆఆ...
ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన వెదురు వేణువై పలికింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

పలుకే పాడని పాట చిరునవ్వు పూలకే పూత
గరిసా సదపమా గమద మదని
దనిరిని గరిగరిసా సదసదపా మపగా
నడకే నెమలికి ఆట  లే నడుము కలలకే కవ్వింత
కలలుగన్న నా శ్రీమతి రాగా ఈ బ్రతుకే పరిమళించింది

నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై అమరదీపమై వెలిగింది
నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది

Thurupu Thela Thelavaragane - Srivari Muchatlu, Lyrics

Movie : Srivari Muchatlu
Music : Chakravarthy
Lyrics : Dasari Narayana Rao
Singer : P. Susheela

తూరుపు తెలతెల వారగనే తలుపులు తెరిచి తెరవగనే
తూరుపు తెలతెల వారగనే తలుపులు తెరిచి తెరవగనే
చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..
తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..
శ్రీవారి ముచ్చట్లు.. శ్రీ శ్రీవారి ముచ్చట్లు..
శ్రీవారి ముచ్చట్లు.. నీ శ్రీవారి ముచ్చట్లు..

కలగన్న మొదటి రాత్రికి తలుపు తెరచే వేళ ఇది
వలదన్న ఒంటి నిండా సిగ్గులొచ్చే వేళ ఇది..
బెదురు చూపుల కనులతో ఎదురు చూడని వణుకులతో...
బెదురు చూపుల కనులతో ఎదురు చూడని వణుకులతో..
రెప్పలార్పని ఈ క్షణం సృష్టికే మూలధనం
తెప్పరిల్లిన మరుక్షణం ఆడదానికి జన్మఫలం
ఆడదానికి జన్మఫలం...

తూరుపు తెలతెల వారగనే తలుపులు తెరచి తెరవగనే
చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..
తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..

ఇన్నాళ్ళ మూగనోముకు మనసు విప్పే వేళ ఇది..
ఇన్నేళ్ళ కన్నెపూజకు హారతిచ్చే చోటు ఇది..
మల్లెపందిరి నీడన తెల్లపానుపు నడుమన
మల్లెపందిరి నీడన తెల్లపానుపు నడుమన
ఎదురు చూసిన ఈ క్షణం మరువలేని అనుభవం
మరచిపోనీ ఈ స్థలం ఆడదానికి ఆలయం
ఆడదానికి ఆలయం...

తూరుపు తెలతెల వారగనే తలుపులు తెరచి తెరవగనే
చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..
తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..

Tuesday 21 September 2021

Malle Pandiri Needalona Lyrics - Mayadari Malligadu

Movie : Mayadari Malligadu
Music : K.V. Mahadevan
Singer : Susheela
Lyrics : Acharya Athreya

మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి
మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి
మా అన్నకు మా చంద్రికి ఇది తొలి రేయి నాకిది వరమోయి
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవారనీయకోయి ఈ రేయి

గడుసు పిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ
మొరటువాని మనసు దానికి పులకరించిందీ..
గడుసుపిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ..
మొరటువాని మనసు దానికి పులకరించిందీ..
ఇద్దరికీ ఈనాడు నువ్వే ముద్దు నేర్పాలి
ఆ ముద్దు చూసి చుక్కలే నిను వెక్కిరించాలి

కళ్ళు కుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవార నీయకోయి ఈ రేయి

పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ
పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ.
పెళ్లి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ
పసుపు తాడే నోచుకోని బ్రతుకు నాదీ
ఈ పెళ్ళి చూసి నేను కూడా ముత్తైదువైనాను
ఈ పుణ్ణెమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి

మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి
మా అన్నకు మా చంద్రికి ఇది తొలి రేయి నాకిది వరమోయి
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవారనీయకోయి ఈ రేయి
ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ..
ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ…

Nee Kougililo Taladaachi - Karthika Deepam Movie Song Lyrics

Movie : Karthika Deepam 
Music : Chellapilla Satyam 
Lyrics : Mylavarapu Gopi
Singers : S. Janaki & S. P. Balasubrahmanyam 

నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తల దాచి

చల్లగ తాకే పాల వెన్నెల నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించు
నా కోవెలలో స్వామివి నీవై మనసే దివ్వెగా వెలిగించు
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తల దాచి

నింగి సాక్షి నేల సాక్షి నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడ లోన నాలో నీవే సగపాలు
వేడుకలోను వేదనలోను పాలు తేనెగా ఉందాము
నీ కౌగిలిలో తల దాచి
నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తల దాచి

Wednesday 15 September 2021

Jeevitham Saptasagara Geetham Lyrics - Chinni Krishnudu

జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం

సాగనీ పయనం

కల ఇల కౌగిలించే చోట .. కల ఇల కౌగిలించే చోట


జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం

సాగనీ పయనం

కల ఇల కౌగిలించే చోట .. కల ఇల కౌగిలించే చోట


ఏది భువనం ఏది గగనం తారా తోరణం

ఈ చికాగొ సీరిస్ టవరే  స్వర్గ సోపాణము

ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో


ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము..


హే... బ్రహ్మ మానస గీతం మనిషి గీసిన చిత్రం

చేతనాత్మక శిల్పం

మతి కృతి పల్లవించె చోట .. మతి కృతి పల్లవించె చోట


జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం

సాగనీ పయనం

కల ఇల కౌగిలించే చోట.. కల ఇల కౌగిలించే చోట


ఆ లిబర్టి శిల్ప శిలలలొ స్వేచ్చా జ్యోతులు

ఐక్య రాజ్య సమితిలొన కలిసే జాతులు

ఆకశాన సాగిపోయే అంతరిక్షాలు

ఈ మయామి బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము

హే.. సృష్టి కే ఇది అందం.. దృష్టి కందని దృశ్యం

కవులు రాయని కావ్యం

కృషి ఖుషి సంగమించే చోట

కృషి ఖుషి సంగమించే చోట


జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం

సాగనీ పయనం

కల ఇల కౌగిలించే చోట .. కల ఇల కౌగిలించే చోట