Monday 9 August 2021

Kamini Madana Rara Lyrics in Telugu - Paramanandayya Sishyula Katha

చిత్రం : పరమానందయ్య శిష్యుల కథ (1966)

సంగీతం : ఘంటసాల.

రచన : సముద్రాల.

గానం : ఘంటసాల, లీల.


ఆ..ఆ..ఆ..

కామినీమదన రారా నీ కరుణకోరి పిలిచేరా

కామినీమదన రారా నీ కరుణకోరి పిలిచేరా


నాటి తొలిప్రేమ మురిపాల తేల నాదు జతజేరి లాలించు వేళ

నాటి తొలిప్రేమ మురిపాల తేల నాదు జతజేరి లాలించు వేళ

నెరపిన నీ సరాగాలన్ని .. నెరపిన నీ సరాగాలన్ని

నీటిపై వ్రాతలేనా


!! కామినీమదన రా రా !!


మోము కనకున్న మనలేని స్వామి

ప్రేమ విడనాడి పెడమోములేమి 

మోము కనకున్న మనలేని స్వామి

ప్రేమ విడనాడి పెడమోములేమి

ఏమైనా జగమ్మేమన్న .. ఏమైనా జగమ్మేమన్న

నీకై జీవించుగాద


!! కామినీమదన రా రా !!

Sunday 8 August 2021

Enaleni Anandameereyi Lyrics in Telugu - Paramanandayya Sishyula Katha

చిత్రం : పరమానందయ్య శిష్యుల కథ (1966)

సంగీతం : ఘంటసాల

రచన : వెంపటి సదాశివ బ్రహ్మం

గానం : ఘంటసాల , జానకి 


ఎనలేని ఆనందమీరేయి 

మనకింక రాబోదు ఈ హాయి

ఎనలేని ఆనందమీరేయి 

మనకింక రాబోదు ఈ హాయి


చరణం:1

మురిపించనా ప్రేమ కురిపించనా

నా కౌగిటిలో నిన్ను కరిగించనా 

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 

మురిపించనా ప్రేమ కురిపించనా

నా కౌగిటిలో నిన్ను కరిగించనా


మురిపించి నీ ప్రేమ కురిపించినా

మురిపించి నీ ప్రేమ కురిపించినా 

పరవశమై ఈ మేను మరచేపోనా


ఎనలేని ఆనంద మీరేయి మనకింక రాబోదు ఈ హాయి


చరణం:2

శృంగారజలధి తరంగాల తేలించి

ఉయ్యాల లూగించి లాలించనా 

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 

శృంగారజలధి తరంగాల తేలించి

ఉయ్యాల లూగించి లాలించనా


కనుదోయికే విందు నీ అందము

కనుదోయికే విందు నీ అందము

ప్రేమానురాగాలె ఈ బంధము


హోయ్..ఎనలేని ఆనంద మీరేయి మనకింక రాబోదు ఈ హాయి

ఆ ఆ ఆ ఆ ఆ

Saturday 7 August 2021

Chirunavvuloni Hayi Lyrics in Telugu - Aggi Barata, NTR Songs

Movie : అగ్గిబరాటా (1966)
Music : విజయా కృష్ణమూర్తి
Lyricist : D.C.నారాయణ రెడ్డి
Singers : ఘంటసాల, P.సుశీల

పల్లవి:
చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి

చరణం:1
నెలరాజు సైగచేసె వలరాజు తొంగిచూసె
నెలరాజు సైగచేసె వలరాజు తొంగిచూసె
సిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసె
సిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసె

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి

చరణం:2
నయనాల తారనీవె..నా రాజహంస రావె
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నయనాల తారనీవె..నా రాజహంస రావె
నను చెరదీసి మనసార చూసి పెనవెసి నావు నీవె
నను చెరదీసి మనసార చూసి పెనవెసి నావు నీవె

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి

చరణం:3
పవళించు మేనిలోన రవళించె రాగవీణ
పవళించు మేనిలోన రవళించె రాగవీణ
నీలాలనింగి లోలోనపొంగి కురిపించె పూలవాన
నీలాలనింగి లోలోనపొంగి కురిపించె పూలవాన

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి 

Naaloni Ragameeve Lyrics in Telugu - Paramanandayya Sishyula Katha

చిత్రం : పరమానందయ్య శిష్యుల కథ (1966)

సంగీతం : ఘంటసాల

రచన : సముద్రాల

గానం : ఘంటసాల, సుశీల


ఓహో...ఓహో..ఓ...ఓ..

నాలోని రాగం నీవే నడయాడు తీగనీవే

పవళించెలోన బంగారు వీణ పిలికించ నీవు రావె


నెలరాజువైన నీవే చెలికాడవైన నీవే

చిరునవ్వులోన తొలిచూపులోన కరగించివేసి నావె

నెలరాజువైన నీవె


నీ నీడ సోకగానె నీ మేను తాకగానె

ము అహ..ఆ..ఒహొ..ఆ..ముహు

నీ నీడ సోకగానె నీ మేను తాకగానె

మరులేవొ వీచె మనసేమొపూచె విరివానలోన కురిసేనె

నెలరాజు..కరగించివేసి నావే..నెలరాజువైన నీవే


నీ చేయి విడువలేను ఈ హాయి మరువలేను

ఆ..అహ..ఆ..ఒహొ..ఆ..ముహు..

నీ చేయి విడువలేను ఈ హాయి మరువలేను

కనరాని వింత ఈ పులకరింత నను నిలువనీయదేమోయి

నాలోని..నీవు రావే..నాలోని రాగం నీవే


ఆహా...ఓహొ..మూహు..హు..

Friday 6 August 2021

Ekkado Ledule Devudu Lyrics - Marapurani Manishi

సినిమా : మరపురాని మనిషి

సంగీతం : K.V.మహదేవన్

రచన : ఆత్రేయ

గానం : ఘంటసాల


ఎక్కడో లేడు లే దేవుడు నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు

ఎక్కడో లేడు లే దేవుడు నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు

మమతలున్న మనసులో కొలువుంటాడు

మమతలున్న మనసులో కొలువుంటాడు

కరుణ గల కళ్ళల్లో కనిపిస్తాడు 

ఎక్కడో లేడు లే దేవుడు నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు


పుట్టే ప్రతి చిట్టిపాప పుట్టుకలో

తనకు మనిషిమీద నమ్మకం చాటుతాడు

పుట్టే ప్రతి చిట్టిపాప పుట్టుకలో

తనకు మనిషిమీద నమ్మకం చాటుతాడు

ఆ నమ్మికతో బోసినోట నవ్వుతాడు

ఆ నమ్మికతో బోసినోట నవ్వుతాడు

నిన్నా నవ్వు పెంచి పంచమని పంపినాడు


చదువుతో ఎదగాలి హృదయము

ఆ హృదయానికి నేర్పాలి త్యాగము

చదువుతో ఎదగాలి హృదయము

ఆ హృదయానికి నేర్పాలి త్యాగము

నువ్వు కోరాలి పదిమంది సౌఖ్యము

నువ్వు కోరాలి పదిమంది సౌఖ్యము

నిన్నె కోవెలగా చేసుకుని వుంటాడు దైవము


తనరక్తం పాలుగా పంచుగోవులో

గోవులాంటి పేదవాడి చెమటలో

తనరక్తం పాలుగా పంచుగోవులో

గోవులాంటి పేదవాడి చెమటలో

ఆ చెమట తుడుచు నెనరైన చేతిలో

ఆ చెమట తుడుచు నెనరైన చేతిలో

తానుండి లీలగా ప్రేమగా లాలిస్తాడు


ఎక్కడో లేడు లే దేవుడు నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు

మమతలున్న మనసులో కొలువుంటాడు

కరుణ గల కళ్ళల్లో కనిపిస్తాడు 

ఎక్కడో లేడు లే దేవుడు నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు