Showing posts with label Paramanandayya Sishyula Katha. Show all posts
Showing posts with label Paramanandayya Sishyula Katha. Show all posts

Monday, 9 August 2021

Kamini Madana Rara Lyrics in Telugu - Paramanandayya Sishyula Katha

చిత్రం : పరమానందయ్య శిష్యుల కథ (1966)

సంగీతం : ఘంటసాల.

రచన : సముద్రాల.

గానం : ఘంటసాల, లీల.


ఆ..ఆ..ఆ..

కామినీమదన రారా నీ కరుణకోరి పిలిచేరా

కామినీమదన రారా నీ కరుణకోరి పిలిచేరా


నాటి తొలిప్రేమ మురిపాల తేల నాదు జతజేరి లాలించు వేళ

నాటి తొలిప్రేమ మురిపాల తేల నాదు జతజేరి లాలించు వేళ

నెరపిన నీ సరాగాలన్ని .. నెరపిన నీ సరాగాలన్ని

నీటిపై వ్రాతలేనా


!! కామినీమదన రా రా !!


మోము కనకున్న మనలేని స్వామి

ప్రేమ విడనాడి పెడమోములేమి 

మోము కనకున్న మనలేని స్వామి

ప్రేమ విడనాడి పెడమోములేమి

ఏమైనా జగమ్మేమన్న .. ఏమైనా జగమ్మేమన్న

నీకై జీవించుగాద


!! కామినీమదన రా రా !!

Sunday, 8 August 2021

Enaleni Anandameereyi Lyrics in Telugu - Paramanandayya Sishyula Katha

చిత్రం : పరమానందయ్య శిష్యుల కథ (1966)

సంగీతం : ఘంటసాల

రచన : వెంపటి సదాశివ బ్రహ్మం

గానం : ఘంటసాల , జానకి 


ఎనలేని ఆనందమీరేయి 

మనకింక రాబోదు ఈ హాయి

ఎనలేని ఆనందమీరేయి 

మనకింక రాబోదు ఈ హాయి


చరణం:1

మురిపించనా ప్రేమ కురిపించనా

నా కౌగిటిలో నిన్ను కరిగించనా 

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 

మురిపించనా ప్రేమ కురిపించనా

నా కౌగిటిలో నిన్ను కరిగించనా


మురిపించి నీ ప్రేమ కురిపించినా

మురిపించి నీ ప్రేమ కురిపించినా 

పరవశమై ఈ మేను మరచేపోనా


ఎనలేని ఆనంద మీరేయి మనకింక రాబోదు ఈ హాయి


చరణం:2

శృంగారజలధి తరంగాల తేలించి

ఉయ్యాల లూగించి లాలించనా 

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 

శృంగారజలధి తరంగాల తేలించి

ఉయ్యాల లూగించి లాలించనా


కనుదోయికే విందు నీ అందము

కనుదోయికే విందు నీ అందము

ప్రేమానురాగాలె ఈ బంధము


హోయ్..ఎనలేని ఆనంద మీరేయి మనకింక రాబోదు ఈ హాయి

ఆ ఆ ఆ ఆ ఆ

Saturday, 7 August 2021

Naaloni Ragameeve Lyrics in Telugu - Paramanandayya Sishyula Katha

చిత్రం : పరమానందయ్య శిష్యుల కథ (1966)

సంగీతం : ఘంటసాల

రచన : సముద్రాల

గానం : ఘంటసాల, సుశీల


ఓహో...ఓహో..ఓ...ఓ..

నాలోని రాగం నీవే నడయాడు తీగనీవే

పవళించెలోన బంగారు వీణ పిలికించ నీవు రావె


నెలరాజువైన నీవే చెలికాడవైన నీవే

చిరునవ్వులోన తొలిచూపులోన కరగించివేసి నావె

నెలరాజువైన నీవె


నీ నీడ సోకగానె నీ మేను తాకగానె

ము అహ..ఆ..ఒహొ..ఆ..ముహు

నీ నీడ సోకగానె నీ మేను తాకగానె

మరులేవొ వీచె మనసేమొపూచె విరివానలోన కురిసేనె

నెలరాజు..కరగించివేసి నావే..నెలరాజువైన నీవే


నీ చేయి విడువలేను ఈ హాయి మరువలేను

ఆ..అహ..ఆ..ఒహొ..ఆ..ముహు..

నీ చేయి విడువలేను ఈ హాయి మరువలేను

కనరాని వింత ఈ పులకరింత నను నిలువనీయదేమోయి

నాలోని..నీవు రావే..నాలోని రాగం నీవే


ఆహా...ఓహొ..మూహు..హు..