Showing posts with label Jeevitha Chakram. Show all posts
Showing posts with label Jeevitha Chakram. Show all posts

Tuesday, 20 July 2021

Madhurati Madhuram Song Lyrics - Jeevitha Chakram - NTR Movie


చిత్రం: జీవిత చక్రం
సంగీతం: శంకర్ జైకిషన్
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, శారద

మధురాతి మధురం మన ప్రేమ మధువు
మది నిండలేదు .. తమి తీరలేదు
మధురాతి మధురం మన ప్రేమ మధువు
మది నిండునోయి .. తమి తీరునోయి 

నిను వీణ చేసి  కొనగోట మీటి  అనురాగ గీతాలే .. పలికించనా
ఆ పాటలోని  భావాలు నీవై  నీలోని వలపు నాలోన నిలుపు

మధురాతి మధురం మన ప్రేమ మధువు
మది నిండునోయి .. తమి తీరునోయి
మధురాతి మధురం మన ప్రేమ మధువు

చిరు కోర్కెలేవో ..చిగురించ సాగే .. ఎదలోన ఆశా .. ఊరించ సాగే
నీ ఆశలన్ని .. విరబూయగానే .. పూమాల చేసి .. మెడలోన వేతు

మధురాతి మధురం మన ప్రేమ మధువు
మది నిండునోయి .. తమి తీరునోయి
మధురాతి మధురం మన ప్రేమ మధువు

నా గుడిలోనా  గుడి కట్టినానూ గుడిలోన దేవతలా నివసించవా
గుడిలోన ఉన్నా  ఎడమేది ఉన్నా ఈ దేవి  నీ కొరకే  జీవించులే 

మధురాతి మధురం మన ప్రేమ మధువు.. ఆ ..ఆ ఆ ఆ ...ఆ ఆ 
మధురాతి మధురం మన ప్రేమ మధువు
మధురాతి మధురం మన ప్రేమ మధువు