Showing posts with label Kula Deivam. Show all posts
Showing posts with label Kula Deivam. Show all posts

Wednesday, 9 August 2023

Raave Raave Vayyari - Kuladaivam Song Lyrics రావే రావే వయ్యారి ఓచెలీ

Movie : Kuladaivam కులదైవం (1960)
Music : Master Venu
SIngers : Susheela, Chitharanjan
Lyrics : Samudrala Jr.

రావే రావే వయ్యారి ఓచెలీ
రావే రావే వయ్యారి ఓచెలీ.. నా గారాల జిలిబిలి జాబిలీ
రావే రావే వయ్యారి ఓచెలీ

చాలు చాలోయి సఖ ఈ కేళి
చాలు చాలోయి సఖ ఈ కేళి .. చెలులెవరైనా చూసిన ఎగతాళి
చాలు చాలోయి సఖ ఈ కేళి

దొరవారు కన్నులుమూసి దోచేందుకు వేరేముంది
దొరికేది కన్నియ వలపే దోచారది ఇంతకు మునుపే
ఓహో చమత్కారి వే ఓ జవరాలా

చాలు చాలోయి సఖ ఈ కేళి చెలులెవరైన చూసిన ఎగతాళి
చాలు చాలోయి సఖ ఈ కేళి

కలవోలె కాపరాలు కలకాలం సాగాలంటే
కలవాలి మనసూ మనసూ శృతిలో లయగా మెలగాలీ
తమరే సదా నాకు మనసైనా జీవనమైనా

రావే రావే వయ్యారి ఓచెలీ నాగారాల జిలిబిలి జాబిలి
రావే రావే వయ్యారి.. ఓచెలీ

నీ కేలూ వీడగతరమే .. వేడేది నేనా వరమే
నిజమైతే ఈ అనురాగం .. జీవితమే తీయని రాగం
మనకే సరాగాలు సరదాలు శాశ్వతమేలే
రావే రావే వయ్యారి ఓచెలీ
చాలు చాలోయి సఖ ఈ కేళి
ఓ..ఓ...ఓ..ఓ..ఓ..ఓ..