Showing posts with label Dhanama Daivama. Show all posts
Showing posts with label Dhanama Daivama. Show all posts

Monday, 12 December 2011

Nee Madi Challaga Song Lyrics From Dhanama Daivama

నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలొ వేదన మరచిపో
నీ మది చల్లగా ...

ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు
ఏ సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే
మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే

జానకి సహనము రాముని సుగుణము
ఏ యుగమైనను ఇలకే ఆదర్శము
వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము

నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలొ వేదన మరచిపో
నీ మది చల్లగా ...