Monday, 16 April 2018

Ee Reye Neevu Nenu Song Lyrics in Telugu - Pidugu Ramudu Songs Lyrics

Movie : Pidugu Ramudu
Cast : N.T.Rama Rao, Rajasri
Music : T.V.Raju
Singer : Ghantasala, P. Susheela
Lyrics : C. Narayana Reddy

ఓహో..హో.. ఓ..ఓ..ఓ..ఓ.. ఓహో..ఓ
ఓహో..హో.. ఓ..ఓ..ఓ..ఓ.. ఓహో..హో..
ఓ..ఓ..ఓ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. హా..ఓ
ఓ..ఓ..ఓ.. ఓహో..హో..ఓ..ఓ.. ఓ..ఓహో..హో..ఓ.ఓ

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..


ఏ మబ్బు మాటున్నావో.. ఏ పొదల చాటున్నావో
ఏ మబ్బు మాటున్నావో.. ఏ పొదల చాటున్నావో
ఏ గాలి తరగలపైనా.. ఊగి ఊగి పోతున్నావో
ఏ గాలి తరగలపైనా.. ఊగి ఊగి పోతున్నావో
కలగా.. నన్నే.. కవ్వించేవో..

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..


చందమామలో ఉన్నాను.. చల్లగాలిలో ఉన్నానూ..ఊ..
చందమామలో ఉన్నాను.. చల్లగాలిలో ఉన్నాను
నీ కంటి పాపలలోనా.. నేనూ దాగి ఉన్నానూ..ఊ..
నీ కంటి పాపలలోనా.. నేనూ దాగి ఉన్నాను
నీలో.. నేనై.. నిలిచున్నాను..ఊ ..

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..


ఆనాటి చూపులన్ని.. లోన దాచుకున్నానూ..ఊ
ఆనాటి చూపులన్ని.. లోన దాచుకున్నాను
నీవు లేని వెన్నెలల్లోన నిలువజాలకున్నానూ..ఊ
నీవు లేని వెన్నెలల్లోన నిలువజాలకున్నాను

కనవే.. చెలియా.. కనిపించేనూ

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..

Rara Kougili Chera Song Lyrics in Telugu

Movie : Pidugu Ramudu
Cast : N.T.Rama Rao, L. Vijayalakshmi
Music : T.V.Raju
Singer : P. Susheela
Lyrics : C. Narayana Reddy

రా రా రారా కౌగిలి చేర రారా దొరా..
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా
నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా
మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చినవాడా
మెరుపులున్న చినవాడా
రా రా రారా కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
రా రా కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...

చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
మనసందుకో నా మరులందుకో.... మనసందుకో నా మరులందుకో....
ఓ మగరాయడా నీకు బిగువెందుకో
రా రా కౌగిలి చేర రారా దొరా....ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...

పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
మాటాడవా సయ్యాటాడవా.... మాటాడవా సయ్యాటాడవా....
నీ కొస చూపుతో నన్ను వేటాడవా
రా రా కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
రా రా కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...

Thursday, 29 December 2011

Paruvam Vanaga Song Lyrics From Roja, A.R.Rahman Roja Songs Lyrics

Music : Roja(1992)
Music : A.R.Rahman
Lyricist : Veturi
Singers : S.P.Balasubramaniam, Sujatha


పల్లవి:
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదివే నీవైతే అల నేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె

చరణం 1:
నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగులలో తేలనీ నీ గుండెలో నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ

చరణం 2:
నీ గారాల చూపులే నాలో రేపెను మొహం
నీ మందార నవ్వులే నాకే వేసెను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకో

Telugu Devotional Songs - Baktha Thukaram Lyrics - Ghana Ghana Sundara Lyrics

చిత్రం : భక్త తుకారాం (1973)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:
హరి ఓం... హరి ఓం... హరి ఓం... ఆ... ఆ... ఆ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో
అది మధుర మధుర మధురమౌ ఓంకారమో
పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా

చరణం 1:
ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
నిఖిల జగతి నివాళులిడదా... నిఖిల జగతి నివాళులిడదా
వేడదా... కొనియాడదా... పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా

చరణం 2:
గిరులూ ఝరులూ విరులూ తరులూ...
నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వరా... సకల చరాచర లోకేశ్వరేశ్వరా
శ్రీకరా... భవహరా...పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...

Padimandilo Pata Padina Telugu Song Lyrics From Ananda Nilayam

చిత్రం : ఆనంద నిలయం (1971)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి:
పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే...... !!పది!!

చరణం 1:
గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..||2||
ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే....

చరణం 2:
ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.... వసంతమొక్కటే ||2||
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ||2||
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే......

Acha Telugu Bashara Lyrics - Superheroes Movie Lyrics

చిత్రం : సూపర్ హీరోస్ (1997)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : ఎ.వి.ఎస్.
నేపధ్య గానం : బాలు, సుజాత


పల్లవి:
అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...
అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే

చరణం 1:
ఆకసాన సృష్టికర్త బ్రహ్మరా...
అవనిమీద సృష్టికర్త అమ్మరా ||2||
గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం
నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం
అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసరా
అమ్మంటే స్పష్టమైన యాసరా
అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే...
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...

చరణం 2:
అమ్మపాట మానవాళి జాతీయగీతం
అమ్మమాట ఆవుపాల జలపాతం ||2||
పాలతోటి మురిపాలు
ఇదే అమ్మ స్థన్యం
ప్రేమ కరుణ, జాలి, దయ..
ఇవే అమ్మ సైన్యం
అమ్మంటే జనజీవన వేదమురా...
అమ్మంటే మరో ప్రణవనాదంరా..
అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే...
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...

Dagudumuthalu - Adagaka ichina Manase Muddu Lyrics - Old Telugu Songs Lyrics

చిత్రం : దాగుడుమూతలు (1964)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:
అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం 1:
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం 2:
చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు

చరణం 3:
పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ఊహుహు.హూహు
చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ముద్దుకు ముద్దు