Wednesday, 21 November 2018

Pranaya Raga Vaahini Song Lyrics - Maayaa Mascheendra

చిత్రం : మాయా మశ్చీంద్ర (1975)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..
ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..

మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ..
ప్రణయ రాగ జీవనా...ప్రియా...వసంత మోహనా..

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

మలయ పవన మాలికలు.. చెలియా పలికే ఏమని..
మలయ పవన మాలికలు.. చెలియా పలికే ఏమని..
పొదరింట లేడు..పూవింటి వాడు..
పొదరింట లేడు..పూవింటి వాడు..ఎదురుగా వున్నాడనీ..

ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..

లలిత శారద చంద్రికలు..అలలై పాడేను ఏమనీ..
లలిత శారద చంద్రికలు..అలలై పాడేను ఏమనీ..
పదునారు కళలా.. పరువాల సిరులా
పదునారు కళలా.. పరువాల సిరులా
పసిడి బొమ్మవు నీవనీ..

ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..
మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ..
ప్రణయ రాగ జీవనా...ప్రియా...వసంత మోహనా

Saturday, 29 September 2018

Dikkulu Choodaku Ramayya - Kalpana Songs Lyrics

Movie : Kalpana
Cast : మురళి మోహన్, జయచిత్ర
Music :   కె.చక్రవర్తి
Lyrics : వేటూరి 
Singers : జి.ఆనంద్ , పి. సుశీల

 దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ
 దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సీతమ్మ
 సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ
 సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ

 ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో
 ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో
 కదలికలన్నీ కథలుగ అల్లి కవితలే రాసుకుంటావో రామయ్య
 పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు
 పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు
 ఆ వెన్నెలలో నీ కన్నులలో... ఆ వెన్నెలలో నీ కన్నులలో...
 సన్నజాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు
 సన్నజాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు
 సీతమ్మ... సీతమ్మ...

 దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ
 సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ

 కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో
 కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో
 కలలిక మాని కలయికలో నా కన్నులలో చూసుకుంటావో రామయ్య
 వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు
 వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు
 ఆ వెల్లువలో నా పల్లవిలో... ఆ వెల్లువలో నా పల్లవిలో...
 రాగమే పలికించు అనురాగమై పులకించు
 రాగమే పలికించు అనురాగమై పులకించు
 సీతమ్మ... సీతమ్మ...

 దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ
 సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ

Thursday, 27 September 2018

Paadana Tenugu Pata Lyrics - America Ammayi

చిత్రం : అమెరికా అమ్మాయి (1976)
సంగీతం : జి.కె.వెంకటేష్
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : పి.సుశీల

పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మూపులపైన మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాలపేట మధురామృతాల తేట

ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడునాడులుకదిలించేది వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట

ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్లకు పారాణి మెరిసే కుంకుమబొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడే
తెలుగుతల్లి పెట్టనికోట తెలుగునాట ప్రతిచోట

ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

Oka Venuvu Vinipinchenu - America Ammayi

చిత్రం : అమెరికా అమ్మాయి
సంగీతం : జి.కె. వెంకటేశ్ 
గానం : జి.ఆనంద్ 
గీతరచయిత : మైలవరపు గోపి 

ఒక వేణవు వినిపించెను.. అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..
ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా..

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
నవమల్లిక చినబోయెనూ.. నవమల్లిక చినబోయెను..
చిరునవ్వు సొగసులో..

ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా..

వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
రేరాణియే నా రాణికి.. రేరాణియే నా రాణికి.
పారాణి పూసెనూ..

ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా..

ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా..
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా..
నా గుండెలో వెలిగించెనూ.. నా గుండెలో వెలిగించెను..
సింగార దీపికా..

ఒక వేణవు వినిపించెను.. అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..
ఒక వేణవు వినిపించెను.. అనురాగ గీతికా..

Tuesday, 10 July 2018

Veena Naadi Teega Needi Song Lyrics - Katakatala Rudraiah,

చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం : జె.వి. రాఘవులు
రచన : వేటూరి
గానం: S.P.బాలు, P.సుశీల

పల్లవి:
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..
పువ్వు నాది..పూత నీది..ఆకుచాటు అందముంది..
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..తీగ చాటు రాగ ముంది..

చరణం 1:
తొలిపొద్దు ముద్దాడగానే..ఎరుపెక్కె తూరుపు దిక్కూ..
తొలిచూపు రా పాడగానే..వలపొక్కటే వయసు దిక్కూ..
వరదల్లే వాటేసి మనసల్లే మాటేసి వయసల్లే కాటేస్తే చిక్కు
తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..తీగ చాటు రాగ ముంది..

చరణం 2:
మబ్బుల్లో మెరుపల్లే కాదూ..వలపు వాన కురిసీ వెలిసి పోదూ..
మనసంటే మాటలు కాదూ..అది మాట ఇస్తే మరచి పోదూ..
బ్రతుకల్లే జతగూడి వలపల్లె వనగూడి వొడిలోనే గుడి కట్టే దిక్కు
నా గుడి దీపమై నాకు దక్కూ

వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..
పువ్వు నాది..పూత నీది..ఆకుచాటు అందముంది..
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..తీగ చాటు రాగ ముంది..

Wednesday, 6 June 2018

Okate Hrudayam Kosamu Song Lyrics - Chaduvukunna Ammayilu

చిత్రం : చదువుకున్న అమ్మాయిలు
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:
గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .

ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ

చరణం 1:
ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా.. ఆ . . .

ఆ . . ఓ . .
జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ
ఆ . . .

చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
ఓ . . .

చరణం 2:
రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము
ఆ . . .
ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ

Neeko Thodu Kaavali - Chaduvukunna Ammayilu Lyrics

చిత్రం : చదువుకున్న అమ్మాయిలు
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి,
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి

చరణం 1:
నవనాగరీక జీవితాన తేలుదాం,
నైటుక్లబ్బులందు నాట్యమాడి
సోలుదాం
హో హో హొ హో
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి,
నేను అంతకన్న అప్టుడేటు బేబిని
వగలాడి నీకు తాళి బరువు ఎందుకు,
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైనజవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

చరణం 2:
నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను,
ఏదో హారుమణి వాయిస్తూ పాడుకుంటాను

దనిస నిదనిప మగదిస దిగమప

నేను చదువులేనిదాననని అలుసు నీకేల,
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల
నీతో వియ్యం దినదినగండం,
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని

ఓ తల్లి దయచేయి కోటిదండాలు

చరణం 3:
సిరులూ నగలూ మాకు లేవోయి,
తళుకూ బెళుకుల మోజు లేదోయి
హహహా...
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు
ధనరాశి కన్న నీ గుణమే మిన్న,
నీలో సంస్కారకాంతులున్నాయి
నీకో బ్రూటు దొరికిందీ
మెడలో జోలె కడుతుందీ
ఈమె కాలి గోటి ధూళి పాటి చేయరు
ఓ త్వరగా దయచేస్తె కోటి దండాలు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ,
హాయ్ నిన్నే నాదాన్ని చేసుకుంటాను