Saturday, 8 May 2021

Challani Raja Lyrics - Ilavelpu Songs Lyrics

 Movie : ఇలవేల్పు 

Singers : పి. లీల, రఘునాధ్


చల్లనిరాజా ఓ చందమామ

చల్లనిరాజా ఓ చందమామ 

నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చRదమామ

చల్లనిరాజా ఓ చందమామ 

నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ

పరమేశుని జడలోన చామంతివి

నీలిమేఘాల నానేటి పూబంతివి

పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి

నిను సేవించెద నను దయచూడవా ఓ వెన్నెల వన్నెల నా చందమామ

చల్లనిరాజా ఓ చందమామ 

నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ


చల్లనిరాజా ఓ చందమామ

చల్లనిరాజా ఓ చందమామ 

నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ

నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా

ఆశలూరించునే చెలి కనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించులే

ఓ ఓ చల్లనిరాజా ఓ చందమామ

చల్లనిరాజా ఓ చందమామ

చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ


నిను చూచిన మనసెంతో వికసించుగా

తొలి కోరికలెన్నో చిగురించుగా

నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా

ఆశలూరించునే చెలి కనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించులే

ఓ ఓ

చల్లనిరాజా ఓ చందమామ

చల్లనిరాజా ఓ చందమామ 

నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ


నను చూడవు పిలచిన మా టాడవు

చిన్నదానను వదలను ప్రియురాలను

నను చూడవు పిలచిన మా టాడవు చిన్నదానను వదలను ప్రియురాలను

నిన్నే కోరానురా నను కరుణించరా ఈ వెన్నెల కన్నెతో విహరించరా


అ అ చల్లనిరాజా ఓ చందమామ 

నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ

Parugulu Theese - Aatma Balam Songs Lyrics, ANR Hit Songs Lyrics

Movie : ఆత్మబలం

Lyrics : ఆచార్య ఆత్రేయ

Music : కె.వి. మహదేవన్

Singers : ఘంటసాల, సుశీల


ఓహో హొహూ ఓ హో


పరుగులు తీసే నీ వయసునకూ పగ్గం వేసెను నా మనసూ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు

ఆహాహ అహాహహ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు

ఆహాహ అహాహహ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు


ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు

ఓహోయని పలికెను నీ వలపు

ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు

ఓహోయని పలికెను నీ వలపు

ఓయని పలికే నీ వలపునకు తీయగ మారెను నా తలపు

తియతీయగ మారెను నా తలపు

ఒహొహొహొ హొహొహొ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు


తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవూ

అహ దోబూచాడెను నా నగవూ

దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ మరులు

దోరదోరగ పండెను నీ మరులూ

ఒహొహొహొ హొహొహొ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు


లేదనిపించే నీ నడుము .. అహహా

నాదనిపించెను ఈ క్షణము .. ముహు 

లేదనిపించె నీ నడుము నాదనిపించెను ఈ క్షణము

ఉందో లేదో ఈ జగము

ఉందో లేదో ఈ జగము ఉందువు నీవు నాలో సగము

ఇది నిజము కాదనుము


పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు

ఆహాహ అహాహహ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

Friday, 7 June 2019

Chigurakulalo Chilakamma Lyrics - Donga Ramudu

చిత్రం : దొంగరాముడు
గానం : ఘంటసాల, జిక్కి

ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
పున్నమి వెన్నెల గిలిగింతలకు తూగిన మల్లెల మురిపాలు

నీ చిరునవ్వుకు సరికావమ్మ
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేనా
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య

వలచే కోమలి వయ్యారాలకు
కలసే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ

పై మెరుగులకే భ్రమపడకయ్య
మనసే మాయని సొగసయ్య
గుణమే తరుగని ధనమయ్య

ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ

Bommanu Chesi Song Lyrics - Devatha

Movie : Devata
Music : S. P. Kodandapani
Singers: Ghantasala Venkateswara Rao
Lyricist: Veturi

బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా ఆ కరిగిపోయే
తలచేది జరుగదూ  జరిగేది తెలియదూ

బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
బొమ్మను చేసి .ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
గారడిచేసి గుండెలు కోసి నవ్వేవు ఈవింత చాలికా

బొమ్మను చేసీ ప్రాణము పోసి ఆడేవు నీకిది వే ...డుకా

అందాలు సృష్టించినావూ దయతో నీవూ మరలా నీచేతితో నీవె తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే ఘాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశా అడియాశ చేసి
కొండంత ఆశా అడియాశ చేసి
పాతాళలోకాల తోసేవులే ...

బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా

ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
ఒకనాటి ఉద్యానవనమూ  నేడు కనమూ
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగమధువు అందించి నీవూ
హాలాహలజ్వాల చేసేవులే .
ఆనందనౌకా పయనించువేళా
ఆనందనౌకా పయనించువేళా శోకాల సంద్రాల ముంచేవులే

బొమ్మను చేసీ . ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా .ఆ..
గారడి చేసీ . గుండెలు కోసి . నవ్వేవు ఈవింత చాలిక.
బొమ్మను చేసి .ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా

Tuesday, 14 May 2019

Tholi Valape Song Lyrics - Needa Leni Adadi

Movie : Needa Leni Adadi
Cast : Narasimha Raju, Prabha
Music : Satyam
Lyrics : C.Narayana Reddy
Singer : P.Suseela,  S P balu

తొలి వలపే.. తొలి వలపే
తియ్యనిదీ.. తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది

తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
నీ కొరకే దాచినదీ వేరెవరూ దోచనిదీ

తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది

పొగరూ సొగసూ గల చిన్నది
బిగి కౌగిలిలో ఒదిగున్నది
పొగరూ.. సొగసూ.. గల చిన్నది
బిగి కౌగిలిలో ఒదిగున్నది
ఈ విసురూ ఎక్కడిదీ
నీ జతలోనే నేర్చినదీ

తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది

కనులూ కలలూ కలబోయనీ
నీలో సగమై పెనవేయనీ
కనులూ కలలూ కలబోయనీ
నీలో సగమై పెనవేయనీ
కలకాలం ఈ ప్రణయం
నిలవాలీ మనకోసం

తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిదీ

వలచే హృదయం విలువైనది
కలిసే బంధం విడిపోనిదీ
అనురాగం కొనలేనిదీ
అది ఒకటే మన పెన్నిధీ

తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిదీ 

Thursday, 9 May 2019

Ra Vennela Dora Song Lyrics - Lakshmi Kataksham


ఆహా హ అహ హ...
అహ హ ఓహో ఓ ఓ...
ఆహ హ హా...

రా వెన్నెల దొరా కన్నియను చేరా.
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ.
రా వెన్నెల దొరా కన్నియను చేరా .
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ.
ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా.
ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా.
ఉన్నానులేవే ప్రియతమా ఆ ఆ.
నీ మగసిరి నగవులు చాలునులే...
నీ సొగసరి నటనలు చాలునులే .
నీ మనసైన తారను నే కానులే...

రా వెన్నెల దొరా వింత కనవేరా.
రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ.
ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా...
ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా...
ఎద నిండిపోరా చందమా ఆ ఆ.
నీ పగడపు పెదవుల జిగి నేనే...
నీ చెదరని కౌగిలి బిగి నేనే...
నా ఎద నిండ నీవే నిలిచేవులే...

రా వెన్నెల దొరా కన్నియను చేరా...
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ.
రా వెన్నెల దొరా వింత కనవేరా.
రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ.

Tuesday, 7 May 2019

Jorumeedunnavu Tummeda Song Lyrics - Sivaranjani

జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా

ముస్తాబు అయ్యావు తుమ్మెదా కస్తూరి రాసావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా మల్లెపందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా ఆ మాలెవరికోసమే తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా

మెత్తన్ని పరుపూలు తుమ్మెదా గుత్తంగ కుట్టావు తుమ్మెదా
ఒత్తైన పరుపుపై తుమ్మెదా. అత్తర్లు చల్లావు తుమ్మెదా ...
ఆ ... ఆ... ఆ... ఆ... ఆ
పక్కవేసుంచావు తుమ్మెదా ఆ పక్కెవరికోసమే తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా