Wednesday 20 October 2021

Neeli Vennela Jaabili - Rajendrudu Gajendrudu Song Lyrics

Movie:  Rajendrudu Gajendrudu

Cast:  Rajendra Prasad,Soundarya

Music Director:  S. V. Krishna Reddy

Lyricist:  Jonnavithula Ramalingeswara Rao

Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra


నీలి వెన్నెల జాబిలీ

నీలి వెన్నెల జాబిలీ

వీణ నవ్వుల ఆమని

రా మరీ నా దరీ అందుకో ప్రేమనీ

నీలి కన్నుల కోమలి


నీలి వెన్నెల జాబిలీ

నీలి వెన్నెల జాబిలీ

వీణ నవ్వుల ఆమని

చేరనీ నీ దరీ పొందనీ ప్రేమనీ

రాగ వీధుల సాగనీ


నా వలపుల కోవెల మంటపం

నీ రాకకు పలికెను స్వాగతం

సిరి మల్లెల రువ్వే సోయగం

తోలి ప్రేమకు ఆయెను తోరణం


ప్రేమలే పెనవేయగా

ఆశలే నెరవేరగా

అనురాగ సిరులు సరసాల సుధలు

మనసారా మారులు పండించుకుందమా


నీలి వెన్నెల జాబిలీ

వీణ నవ్వుల ఆమని


ఓ చల్లని చూపుల దేవత

ప్రతి జన్మకు కోరెద నీ జత

నా కుంకుమ రేఖల బంధమా

జత చేరుమా జీవన రాగమా


కాలమా అనుకూలమూ

కానుకా సుముహూర్తమూ

గోరింట పూల పొదరింటి లోన

నీ కంటి దీపమై జంట చేరనా


నీలి వెన్నెల జాబిలీ

వీణ నవ్వుల ఆమని

చేరనీ నీ దరీ పొందనీ ప్రేమనీ

రాగ వీధుల సాగనీ


నీలి వెన్నెల జాబిలీ

వీణ నవ్వుల ఆమని

రా మరీ నా దరీ అందుకో ప్రేమనీ

నీలి కన్నుల కోమలి

No comments:

Post a Comment